Skip to content
Sun News Sun News Sun News

The Sun News

Sun News Sun News Sun News

The Sun News

Close

Search

E-paper
  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Home/crime/సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి
crime

సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి

By admin
March 4, 2026 1 Min Read
0

రైల్లో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరి ప్రయాణికుల మధ్య సీటు కోసం గొడవ జరిగింది. మాట మాట పెరిగింది. అంతలోనే ఓ ప్రయాణికుడు తుపాకీ తీసి తోటి ప్రయాణికుడిని బెదిరించడంతో.. ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురి అయ్యారు. ఈ గొడవ అంతా దూరం నుంచి చూస్తున్న ఓ ప్రయాణికుడు తుపాకీతో బెదిరిస్తున్న ప్రయాణికుడిని ఫోటోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.

యలహంక నుంచి కాచిగూడ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ఇద్దరు ప్రయాణికులు సీటు విషయంలో గొడవపడ్డారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఓ ప్రయాణికుడు తన దగ్గర ఉన్న తుపాకీ తీసి బెదిరించడంతో జనరల్ కోచ్ లోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ గొడవ జరుగుతున్న తంతును దూరం నుంచి మరో ప్రయాణికుడు ఫోటోలు తీసి జీఆర్పీ, ఆర్పిఎఫ్ పోలీసులకు వాట్సప్ లో ఫిర్యాదు చేశాడు. సరిగ్గా రైలు అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చాక ట్రైన్ ఆపి తుపాకీతో బెదిరించిన వ్యక్తిని పోలీసులు విచారించారు. తుపాకీతో బెదిరించిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం చెందిన మనోహర్ అనే రిటైర్డ్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు.

రిటైర్డ్ పోలీసు ఉద్యోగి వద్ద లైసెన్సుడ్ పిస్టల్ ఉందని పోలీసులు గుర్తించారు. అయితే అతడు తోటి ప్రయాణికులతో సీటు కోసం గొడవపడి భయభ్రాంతులకు గురి చేసే విధంగా తుపాకీ తీసి బెదిరించడాన్ని రైల్వే పోలీసులు సీరియస్ గా పరిగణించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో లైసెన్స్ వెపన్ బయటకు తీసి తుపాకీతో బెదిరించిన ఘటనను పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఫోటోలు తీసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైలు ప్రయాణం ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న సమయంలో తుపాకీతో బెదిరించడంతో ట్రైన్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.

Author

admin

Follow Me
Other Articles
Previous

అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో భారీగా మంటలు

Next

ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Search

Recent Posts

  • ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!
  • సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి
  • అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో భారీగా మంటలు
  • Craft Amazing Blogs That Hook Readers
  • Behind the Mask of Anonymous Power

Find Us

Address
123 Main Street
New York, NY 10001

Hours
Monday–Friday: 9:00AM–5:00PM
Saturday & Sunday: 11:00AM–3:00PM

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Recent Posts

  • ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!
  • సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి
  • అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో భారీగా మంటలు
  • Craft Amazing Blogs That Hook Readers
  • Behind the Mask of Anonymous Power
2026 - Powerd By Rivx Studios