Skip to content
Sun News Sun News Sun News

The Sun News

Sun News Sun News Sun News

The Sun News

Close

Search

E-paper
  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Home/Entertainment/ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!
Entertainment

ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!

By admin
March 4, 2026 2 Min Read
0

ఇక‌పై పెద్ద‌తెర‌- బుల్లితెర స్టార్ల ఉద్యోగాలు ఊస్టింగ్ అవ్వ‌బోతున్నాయా? న‌టీన‌టుల‌కు భారీ పారితోషికాలు చెల్లించి కాల్షీట్లు కొనుక్కోవాల్సిన ప‌రిస్థితి ఉండ‌దా? అంటే.. అవున‌నే తాజా సాంకేతిక‌త నిరూపిస్తోంది. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ హెచ్చ‌రిక‌లు నిజం అవ్వ‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఏఐ బొమ్మ లేదా యానిమేటెడ్ బొమ్మ అని తీసిపారేయ‌డానికి లేదు. చూస్తుండ‌గానే అంతా మారిపోతోంది. శంక‌ర్ `జీన్స్`లో వ‌ర్చువ‌ల్ ఐశ్వ‌ర్యారాయ్ ని చూపించిన‌ప్పుడు గొప్ప ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌వారు.. ఇక‌పై మాన‌వ ప్ర‌పంచంలో సంచ‌రించే వ‌ర్చువ‌ల్ న‌టీన‌టుల‌ను చాలా సాధార‌ణంగా తీసుకునే ఛాన్సుంద‌ని అంచ‌నా. భ‌విష్య‌త్ లో న‌టీన‌టుల‌ను పూర్తిగా కృత్రిమ మేథ‌స్సుతోనే త‌యారు చేస్తార‌నే సంకేతాలు బ‌లంగా ఉన్నాయి. ఇది కేవ‌లం యాంక‌రింగ్ వ‌ర‌కే ప‌రిమితం కాదు… బుల్లితెర‌, పెద్ద తెర‌కు స్టార్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఏఐ చాలా స‌హ‌క‌రించ‌బోతోంది.

భారతీయ బుల్లితెర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. సాంకేతిక పరిజ్ఞానం అంచులను తాకుతూ.. మనుషులకు దీటుగా నటించేందుకు `నైనా ఏవిటిఆర్` అనే ఏఐ బ్యూటీ సిద్ధమైపోయింది. ఇప్పటికే నైనా న‌టించిన కొన్ని వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, మోడ‌లింగ్ అసైన్ మెంట్ల‌కు సంబంధించిన ఇన్ స్టా వీడియోలు ఇంట‌ర్నెట్ ని కుదిపేస్తున్నాయి. దీనిని నిశితంగా గ‌మ‌నిస్తే… నైనా కేవలం ఒక యానిమేషన్ బొమ్మ మాత్రమే కాదు.. అత్యంత అధునాతనమైన `మెషిన్ లెర్నింగ్` మోషన్ క్యాప్చర్ టెక్నాలజీల మేళవింపుతో సృష్టించిన ఒక అద్భుత దృశ్య కావ్యం. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల నైనా అనే పాత్ర‌ధారి కదలికలు, ప్రవర్తన అచ్చం నిజమైన నటిని తలపిస్తూ ప్రేక్షకులను మాయ చేస్తున్నాయి. 

నైనాను ఇంత రియలిస్టిక్‌గా చూపించడం వెనుక `హై-ఎండ్ గ్రాఫిక్స్ రెండరింగ్` సాంకేతికత కీలక పాత్ర పోషించింది. ఆమె చర్మం రంగు, జుట్టు గాలికి ఊగే విధానం, కళ్లలోని సహజమైన మెరుపును గమనిస్తే ఈ బ్యూటీ ఒక వర్చువల్ క్యారెక్టర్ అని నమ్మడం కష్టంగా ఉంది. సాధారణ ఏఐ బొమ్మల్లో ముఖ కవళికలు కృత్రిమంగా, బిగుతుగా ఉంటాయి. కానీ నైనా విషయంలో కోపం, సంతోషం, బాధ వంటి సున్నితమైన ఎమోషన్లను పలికించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఎమోష‌న్స్ ని ప‌లికించ‌డం కోసం సుమారు 50కి పైగా ఫేషియల్ మ్యాపింగ్ పాయింట్స్ ను వాడారు. అందుకే ఆమె పలికించే హావభావాలు ఆ కిల్లింగ్ లుక్స్ ప్రేక్షకులకు చాలా సహజంగా అనిపిస్తున్నాయి.

ఇక నైనా ప్రధాన పాత్రలో రాబోతున్న బుల్లితెర‌ సీరియల్ గురించి పరిశ్రమ వర్గాల్లో భారీ చర్చ సాగుతోంది. బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న ఈ ధారావాహిక 2026 మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంద‌ని స‌మాచారం. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ స్టార్ ప్లస్ లో ఈ వినూత్న ప్రయోగం ప్రసారం కానుందని టాక్ వినిపిస్తోంది. ఒక ఏఐ నటి పూర్తిస్థాయి లీడ్ రోల్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు ఈ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సీరియల్ ఒక ప్రయోగాత్మక, గ్లామరస్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో దీనిని ప్రైమ్ టైమ్ అయిన రాత్రి 8 నుండి 10 గంటల మధ్య స్లాట్‌లో ప్రసారం చేసేందుకు ఛానల్ యాజమాన్యం మొగ్గు చూపుతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ఇందులో నైనా ఒక వర్చువల్ ఏజెంట్‌గా లేదా సూపర్ హ్యూమన్ శక్తి ఉన్న పాత్రలో కనిపిస్తుందని సమాచారం. సమాజంలోని నేరాలను తన స్టైలిష్ మూవ్స్‌తో.. అసాధారణ తెలివితేటలతో ఎలా అడ్డుకుంటుంది? అనేదే ఈ సీరియల్ ప్రధాన కథాంశం. ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా బుల్లితెరపై ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇక సీరియల్ ప్రారంభం కాకముందే నైనా సోషల్ మీడియాలో ఒక పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ‌కు ఇప్పటికే లక్షలాది మంది ఫాలోయర్స్ ఉన్నారు. త‌ను పోస్ట్ చేసే ప్రతి రీల్.. ప్రతి కిల్లింగ్ మూవ్ నెట్టింట నిమిషాల్లో వైరల్ అవుతోంది. విశేషమేమిటంటే ఒక ఏఐ మోడల్ అయి ఉండి కూడా తన గ్లామర్‌తో పెద్ద పెద్ద బ్రాండ్‌ల దృష్టిని ఆకర్షించి `బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్` కూడా దక్కించుకుంటోంది. మనుషులతో సమానంగా క్రేజ్ సంపాదించుకోవడం నైనా సాధించిన పెద్ద విజయం. సాంకేతికత, వినోదం కలిస్తే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూపించడానికి నైనా ఇప్పుడు సిద్ధమైపోయింది. ఈ వినూత్న ప్రయోగం గనుక సక్సెస్ అయితే.. భవిష్యత్తులో మరిన్ని ఏఐ పాత్రలను మనం వెండితెరపై, బుల్లితెరపై చూసే అవకాశం ఉంది. నటీనటుల కొరత లేదా డేట్స్ సమస్యలు లేకుండా ఇలాంటి వర్చువల్ స్టార్స్ ఇండస్ట్రీని ఏలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నైనా నిరూపిస్తోంది.

 

View this post on Instagram

A post shared by N A I N A ❤️ India’s First AI Superstar! (@naina_avtr)

Author

admin

Follow Me
Other Articles
Previous

సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Search

Recent Posts

  • ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!
  • సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి
  • అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో భారీగా మంటలు
  • Craft Amazing Blogs That Hook Readers
  • Behind the Mask of Anonymous Power

Find Us

Address
123 Main Street
New York, NY 10001

Hours
Monday–Friday: 9:00AM–5:00PM
Saturday & Sunday: 11:00AM–3:00PM

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Recent Posts

  • ఇక‌పై పెద్ద‌తెర‌-బుల్లితెర‌కు స్టార్ల‌తో ప‌నే లేదు!
  • సీటు కోసం తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి
  • అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో భారీగా మంటలు
  • Craft Amazing Blogs That Hook Readers
  • Behind the Mask of Anonymous Power
2026 - Powerd By Rivx Studios